మసీదుపై నైజీరియా సైనికుల దాడి

నైజీరియా సైనికులు మసీదుపై దాడి చేయడంతో అనేక మృతి చెందారు. దేశాధ్యక్షుడి ఆదేశాలపై నైజీరియా సైన్యం గత కొంతకాలంగా ఇస్లామిక్ తీవ్రవాదులతో పోరాడుతోంది. నైజీరియా తాలిబాన్లుగా వ్యవహరించబడుతున్న సాయుధ వర్గాన్ని అణిచివేసేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటికే 300 మందికిపైగా మృతి చెందారు.

తాలిబాన్ తీవ్రవాదులతో పోరులో భాగంగా బుధవారం రాత్రి సైనికులు మసీదుపై దాడి చేశారు. ఈ దాడిలో అనేక మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఇరువర్గాల మధ్య యుద్ధానికి మైదుగురి నగరం ప్రధాన కేంద్రమైంది.

మసీదులో జరిగిన తాజా పోరులో తాలిబాన్ నేత మొహమ్మద్ యూసఫ్ తప్పించుకున్నాడు. అతనితోపాటు, మరో 300 మంది సాయుధులు తప్పించుకొని పరారయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇరువర్గాల మధ్య మసీదు ఆవరణలో జరిగిన భీకరపోరులో సుమారు వంద మంది మృతి చెందివుంటారని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి