మాతో రండి: పాక్ ప్రజలకు అల్‌ఖైదా పిలుపు

దేశ ఉనికికి ముప్పుగా పరిణమించిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలపై తాము జరుపుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని పాకిస్థాన్ ప్రజలకు అల్ ఖైదా రెండో అగ్రనేత అయ్మాన్ అల్ జవహిరి విజ్ఞప్తి చేశాడు. సంకీర్ణ సేనలతో తాము జరుపుతున్న యుద్ధంలో ప్రజలు తమ వెంట నిలవాలని కోరాడు. పాక్ ప్రజలు తీవ్రవాదులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చాడు.

"మై ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ పాకిస్థాన్" అనే పేరుతో విడుదలైన కొత్త ఇంగ్లీష్ వీడియోలో జవహిరి ఈ విజ్ఞప్తి చేశాడు. ఎనిమిది నిమిషాల 49 సెకడ్ల నిడిపి ఉన్న ఈ వీడియోలో జవహిరి మాట్లాడుతూ.. పాకిస్థాన్ మిలిటరీ, రాజకీయాల్లో అమెరికా జోక్యం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని హెచ్చరించాడు. పాకిస్థాన్ భవిష్యత్‌కు, ఉనికికి అమెరికా సేనల నేతృత్వంలో జరుగుతున్న యుద్ధం ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి