ముష్‌కు ఎటువంటి సాయం చేయం: పాక్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు తమ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించబోదని ప్రతిపక్ష పార్టీ పీఎంఎల్- ఎన్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్)కు ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ హామీ ఇచ్చారు. కోర్టుల్లో ముషారఫ్‌కు ఎటువంటి సాయం అందించబోమని, గతంలో ఇరుపార్టీల మధ్య కుదిరిన అంగీకారాన్ని గౌరవిస్తామని పేర్కొన్నారు.

పీఎంఎల్- ఎన్ అధ్యక్షుడు, పంజాబ్ ప్రావీన్స్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌తో సమావేశం సందర్భంగా గిలానీ ఈ హామీ ఇచ్చారు. అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు సుప్రీంకోర్టులో మద్దతుగా నిలవడం లేదా అతనికి సాయం చేయడం వంటి పనులేవీ చేయదని షాబాజ్‌కు గిలానీ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి