లంక జట్టుపై దాడి వెనుక విదేశీ హస్తం: పాక్

టెస్ట్ సిరీస్ ఆడేందుకు తమ దేశానికి వచ్చిన శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్రవాద దాడి వెనుక విదేశీ హస్తం ఉందని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. లాహోర్‌లో ఈ ఏడాది మార్చిలో శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో క్రికెటర్లకు రక్షణగా ఉన్న ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. లంక క్రికెటర్లలో పలువురు గాయపడ్డారు. దాడి వెనుక విదేశీ హస్తం ఉందని విదేశీ హస్తం ఉందని పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి ఆరోపించింది. జాతీయ అసెంబ్లీ స్పోర్ట్స్ స్టాండింగ్ కమిటీకి ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడికి సంబంధించి నివేదిక సమర్పించింది.

ఈ దాడి కోసం ఉగ్రవాదులు ఉపయోగించిన ఆయుధాలను పరిశీలిస్తే, దాడి వెనుక విదేశీ హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. ఉపయోగించిన ఆయుధాలను ఆఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు, తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఉపయోగిస్తారని, ఇవి రష్యాలో తయారు చేసినవని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి