సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు

సరిహద్దు వివాదంపై చర్చలు జరిపేందుకు భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈసారి చర్చలు భారత్‌లోనే జరుగుతాయి. ఆగస్టు 7-8 తేదీల్లో ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఖిన్ గాంగ్ శుక్రవారం వెల్లడించారు.

చైనా కౌన్సిలర్ దాయ్ బింగూ, భారత జాతీయ భద్రత సలహాదారు ఎంకే నారాయణన్ ఈ చర్చల్లో పాల్గొంటారు. సరిహద్దు వివాదంతోపాటు ఈ సందర్భంగా చైనా- భారత్ వ్యూహాత్మక, సహకార భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. వీటితో పాటు చర్చల్లో ఇతర అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయని ఖిన్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి