సైన్యం ఉపసంహరణ ముఖ్యమైన మైలురాయి

ఇరాక్ ప్రధాన నగరాల నుంచి తమ సేనల ఉపసంహరణను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యమైన మైలురాయిగా వర్ణించారు. ఇరాక్ నగరాల నుంచి అమెరికా సైన్యాన్ని మంగళవారం ఉపసంహరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాకీ నగరాల్లో శాంతి, భద్రతల పరిరక్షణ బాధ్యతలు స్వదేశీ సైన్యం చేతుల్లోకి వెళ్లాయి.

దీనిపై ఇరాక్ పౌరులు మంగళవారం వేడుకలు కూడా జరుపుకున్నారు. ఇరాక్ నగరాల నుంచి అమెరికా సేనల ఉపసంహరణ బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ఇరాక్ భవిష్యత్ ఇప్పుడు ఆ దేశ ప్రజలు, పాలకుల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. దీనికి తాము సహకరిస్తున్నామని, ఈ చర్యల్లో భాగంగానే సేనలను ఇరాక్ నగరాలను విడిచిపెట్టాయని చెప్పారు.

ఇరాక్‌లోని అమెరికా సేనలు నగరాల బయట ఉన్న స్థావరాలకు వచ్చేశాయి. ఇరాకీయులు ఈ రోజు అర్థవంతమైన వేడుకలు జరుపుకుంటున్నారని బరాక్ ఒబామా తెలిపారు. తాజా పరిణామంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందనను వైట్‌హోస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది అమెరికా, ఇరాక్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. తాజాగా నగరాల్లో శాంతి- భద్రతల పరిరక్షణ బాధ్యతలు ఇరాకీ సేనల చేతుల్లోకి వెళ్లాయి.

వెబ్దునియా పై చదవండి