సముద్రంలో మునిగిపోయిన పడవ.. 17 మంది రోహింగ్యాలు మృతి

గురువారం, 10 ఆగస్టు 2023 (18:55 IST)
మయన్మార్ దేశంలో పెను విషాదం జరిగింది. ఈ దేశంలోని రఖైన్ రాష్ట్రం నుంచి రోహింగ్యా శరణార్థులు పారిపోతున్న పడవ ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని 17 మంది రోహింగ్యాలు జలసమాధి అయ్యారు. ఈ విషయాన్ని మయన్మార్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. బంగ్లాదేశ్, మయన్మార్‌లోని శిబిరాల నుంచి రోహింగ్యాలు ప్రమాదకరమైన సముద్ర ప్రయాణం చేస్తూ ముస్లిం ప్రజలు అధికంగా ఉండే మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు పారిపోతుంటారు. 
 
ఆ విధంగా గత ఆదివారం కొందరు రోహింగ్యాలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, వీరు ప్రయాణించిన పడవ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయినట్టు సిట్వే పట్టణంలోని ష్వే యాంగ్ మట్టా పౌండేషన్‌కు చెందిన ప్రతినిధి బైర్ లా వెల్లడించాడు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 50 మంది వరకు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 17 మంది మృతదేహాలను వెలికి తీశారు. అయితే, పడవలో ఉన్నవారి ఖచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ ఇప్పటివరకు 17 మృతదేహాలను వెలికి తీసినట్టు వారు చెప్పారు. 
 
హమ్మయ్య.. టమోటా ధర తగ్గిందోచ్... కేజీ రూ.100   
 
గత కొన్ని రోజులుగా దేశ ప్రజలను బెంబేలెత్తించిన టమోటా ధర క్రమంగా కిందికి దిగివస్తుంది. స్వరాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు టమోటాలను సరఫరా చేసే ప్రధాన మార్కెట్‌లలో ఒకటైన మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు భారీగా టమోటా పంట వస్తుండటంతో వీటి ధరలు తగ్గాయి. 
 
బుధవారం కిలో రూ.80 నుంచి రూ.100 మేరకు పలికింది. అయితే, గురువారం ఈ ధర మరింతగా తగ్గి, రూ.50 నుంచి రూ.64 మేరకు తగ్గింది. బి గ్రేడ్ టమోటాలు రూ.36 నుంచి రూ.48 వరకు పలికాయి. సగటున కిలో రూ.44 నుంచి రూ.60 మధ్య రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసినట్టు మార్కెట్ యార్డ్ కార్యదర్శి అభిలాష్ తెలిపారు. 
 
కాగా, మదనపల్లె మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా గత నెల 30వ తేదీన కిలో టమోటాలు అత్యధికంగా రూ.196 ధర పలికిన విషయం తెల్సిందే. ఇక వినియోగదారులకు చేరేసరికి ఆ రేటు భారీగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల రూ.250 వరకు పలికింది. ఇటీవల రూ.200 నుంచి రూ.100కు పడిపోగా, గురువారం నాటికి ఈ ధర మరింతగా తగ్గిపోయింది. ఈ వారాంతానికి ఈ రేట్లు మరింతగా తగ్గుతాయని వ్యాపారాలు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు