సినిమాకు దర్శక నిర్మాతలు భార్యభర్తలులాంటివారు అంటారు. ఒక్కోసారి బెడిసికొడితే సినిమా ఆగిపోతుంది కూడా. అయితే దర్శకులను నమ్మి చాలామంది నిర్మాతలు పెట్టుబడి పెడుతుంటారు. దర్శకుడు ఓ లైన్ నిర్మాతలకు చెప్పడం, పెద్ద హీరో చేస్తున్నారని అనడంతో నిర్మాత ముందుకు వస్తాడు. అలా వచ్చి బోర్లాపడిన సందర్భాలు చాలానే వున్నాయి. తాజాగా అఖిల్ అక్కినేనితో అనిల్ సుంకర తీసిన ఏజెంట్ సినిమా అటువంటిదే. ఆ సినిమా మొదటిషో తర్వాత నిర్మాత సోషల్‌మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. సినిమా అంతా దర్శకుడిదే తప్పు. సరైన కథ, కథనం లేకుండా సినిమా తీశాడని ఎద్దేవా చేశారు. అందుకే ఇకపై నాలా ఎవరూ నిర్మాతలు మోసకూడదని అలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చానని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.