నార్త్ అమెరికాలోని మెక్సికో నగరంలో శరీరం గుగుర్పొడిచే ఘటన ఒకటి వెలుగు చూసింది. సుమారుగా 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. ఇటీవలి కాలంలో కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో ఈ దారుణం వెలుగుచూడటం సంచలనంగా మారింది.
మెక్సికో నగరంలోని జాలిస్కో రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాడలాజారాకు దగ్గర్లోని ఒక లోయలో 45 బ్యాగుల మానవ శరీరభాగాలను గుర్తించారు. అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని స్టేట్ ప్రాసిక్యూట్ ఆఫీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
మే 20వ తేదీన దాదాపు 30 ఏళ్ల వయసు ఉన్న ఏడుగురు యువతీయువకులు కనిపించకుండా పోయారు. వారి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వారంతా ఒకే కాల్ సెంటరులో పనిచేస్తున్నారు. అయితే వారి మిస్సింగ్ కేసులు మాత్రం వేర్వేరు రోజుల్లో నమోదయ్యాయి.