Ram Pothineni, Bhagyashree Borse
సినీ హీరో అభిమానికి వీరాభిమాని అయిన వ్యక్తిని ఓ అమ్మాయి ప్రేమిస్తే సక్సెస్ అయిందా. లేదా? అనే పాయింట్ తో ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం రూపొందుతోంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. సినీ హీరోగా ఉపేంద్ర నటిస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. రామ్ క్యారెక్టర్, సినిమా కథాంశం గురించి ఒక గ్లింప్స్ ఇచ్చారు.