60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైనా దేశం గురువారం స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంది.
చైనా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నేటికి అరవై వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆ దేశ ప్రజలు అంగరంగ వైభవంగా అరవైయ్యవ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకులను జరుపుకున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యం కలిగిన చైనా దేశంలో సైన్యం కవాతు చేయగా పాశ్చాత్య దుస్తుల స్థానంలో మావోల దుస్తులు ధరించిన చైనా అధ్యక్షుడు హూ జింతావో పతాకావిష్కరణ అనంతరం సైనిక వందనం స్వీకరించారు. తదనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
సెంట్రల్ బీజింగ్‌లోని తియన్మెన్ స్క్వేర్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది. వేడుకలకు హాజరైన వేలాది మందితో తియన్మెన్ స్క్వేర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. లక్ష మంది సైన్యంతో నిర్వహించిన సైనిక కవాతు ఈ వేడుకలో హైలెట్‌గా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.