కొత్త వైరస్ నియోకోవ్ ... సెమ్మ డెంజర్ మచ్చీ.. ప్రతి ముగ్గిరిలో ఒకరు మృతి!

శుక్రవారం, 28 జనవరి 2022 (12:56 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అనేక రూపాలను సంతరించుకుంటుంది. ఇప్పటికే కరోనా, కరోనా ప్లస్, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి రూపాల్లో ప్రజలను భయపెట్టింది. భయపెడుతుంది కూడా. ఒమిక్రాన్ వైరస్ కారణంగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ శరవేగంగా వ్యాపించింది. ఈ వైరస్ దెబ్బకు ప్రతి రోజూ 3 లక్షలకుపై ప్రజలు ఈ వైరస్ బారినపడుతున్నారు. 
 
ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం తగ్గుతుంది. దీంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలోనే చైనాలని వుహాన్ శాస్త్రవేత్తలు పిడుగులాంటి వార్తను వెల్లడించారు. కొత్త వైరస్ నియోకోవ్ పుట్టుకొచ్చిందని, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా, ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రస్తుతం ఉన్న టీకాలేవీ ఈ వైరస్‌ను ఎదుర్కొనలేవని స్పష్టం చేశారు. 
 
ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, మరణాల రేటు కూడా అధికంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురులో ఒకరు చనిపోవచ్చని అంచనా వేశారు. ఈ వైరస్‌ను తొలుత సౌతాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని, ఇప్పటివరకు అది మనుషులకు సోకలేదని వివరించారు. ప్రస్తుతం జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న ఈ వైరస్... మున్ముందు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు