చీలీలోని అటకామా ఎడారిలో 2013లో ఆస్కార్ మునోజ్ అనే వ్యక్తికి ఓ అస్థిపంజరం లభించింది. దీనిని అతడు స్పెయిన్ వ్యాపారవేత్త రమన్ నవియా ఓసొరియేకు విక్రయించాడు. ప్రస్తుతం ఇతడి వద్దే ఈ అస్థిపంజరం ఉంది. ఈ అస్థిపంజరం మానవ అస్థిపంజరం మాదిరే ఉందికానీ, పుర్రె కొత్త భిన్నంగా ఉండటంతో ఇది గ్రహాంతర వాసులదై ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
ఇది మానవ అస్థిపంజరమే అని డీఎన్‌ఏ పరీక్షలో తేలింది. అయితే.. నెలలు నిండకుండా పుట్టిన శిశువుదని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కానీ, చాలా మంది.. ఇది ఖచ్చితంగా గ్రహాంతర వాసులదే అని, మానవుల పుర్రెకు పూర్తి భిన్నంగా, వింతగా ఉన్న దీని పుర్రెనే అందుకుసాక్ష్యం అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ అస్థిపంజరంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు మాత్రం తల బద్ధలైపోతోంది.