నిద్ర లేచి చూడగానే నువ్వు గర్భవతివి అని చెప్పిన డాక్టర్... షాక్ తిన్న అమ్మాయి...

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:07 IST)
తలనొప్పిగా ఉందని పడుకున్న అమ్మాయి నిద్రలేచి చూసేసరికి ఆసుపత్రిలో ఉంది. అదేమిటని ప్రశ్నించిన అమ్మాయి, కోమాలోకి వెళ్లడం వల్ల ఇక్కడ చేర్పించారని తెలుసుకుంది. తను గర్భవతిని అని కూడా తెలుసుకుంది. అప్పటి దాకా లేనిది వెంటనే 7 నెలల గర్భం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయింది. అయితే కోమాలోకి వెళ్లి ఎన్నో నెలలు కాలేదు. కేవలం ఒక రోజు మాత్రమే అయింది. ఆమెపై ఎలాంటి లైంగిక దాడి లేదా అత్యాచారం జరగలేదు. 
 
అసలు విషయం ఏమిటంటే, వింత వ్యాధితో బాధపడుతున్న ఆమెకు రెండు గర్భ సంచులు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఆమె తన ప్రియుడితో శృంగారంలో పాల్గొంది. రెండు గర్భ సంచులు ఉండటంతో ఒక గర్భాశయం నుండి రుతుక్రమం రావడం నిలిచిపోలేదు. దాంతో ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించలేకపోయింది. మరో విషయం ఏమిటంటే శిశువు ఉన్న గర్భాశయం వెన్నుపూస వెనుక ఉండటంతో పొట్ట కూడా ముందుకు రాలేదు. 
 
18 ఏళ్ల ఆ అమ్మాయికి తలనొప్పి రావడం, వెంటనే కోమాలోకి జారుకోవడం వీటన్నింటికీ కారణం అదేనని వైద్యులు చెప్పారు. బిడ్డను సురక్షితంగా బయటకు తీసారు వైద్యులు. ఫిజియోథెరఫీ చదువుతున్న ఆ అమ్మాయి ఇలా జన్మనివ్వడం సంతోషంగా ఉందని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు