మార్చి 10వ తేదీన ప్రమాదానికి గురైన ఇథియోపియా విమానంలో ప్రయాణించే 157 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యక్తి మాత్రం అనూహ్యంగా ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగాడు. గ్రీస్‌కు చెందిన ఆంటోనీ మావ్రోపోలస్ ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. నైరోబీలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సుకు వెళ్లేందుకు ఆయన అదే విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు.
ఎంత చెప్పినా వినకపోవడంతో అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ సిబ్బంది ఆయనతో మీరు ఇప్పుడు చేయాల్సింది గొడవ పెట్టుకోవడం కాదు, దేవుడికి కృతజ్ఞతలు తెలపడం అని చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. మీరు ఎక్కాల్సిన విమానం కూలిపోయింది, అందులో ఎక్కాల్సిన ప్రయాణీకుల్లో మీరు మాత్రమే మిగిలిపోయారు.