విమానం టైర్లు పట్టుకుని వేలాడుతూ కిందపడిన ఆప్ఘన్ ప్రజలు

సోమవారం, 16 ఆగస్టు 2021 (15:05 IST)
ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడుగా ఉన్న అష్రఫ్ ఘనీ దేశం విడిచిపారిపోయారు. దీంతో కొత్త అధ్యక్షుడుగా బరాదని నియమితులుకానున్నారు. అయితే, కాబూల్‌ను తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్న తర్వాత దేశంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. 
 
ప్రస్తుతం ఆ దేశంలో ఎంత‌టి దారుణ‌మైన, భయానక ప‌రిస్థితులు ఉన్నాయో క‌ళ్లకు క‌ట్టే సంఘ‌ట‌న ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎలాగైనా స‌రే దేశం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తున్న వేల మంది ఆఫ్ఘ‌న్లు.. ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకొస్తున్నారు. ఏ విమానం దొరికితే అందులో ఎక్క‌డానికి ఎగ‌బ‌డుతున్నారు. 
 
అయితే ఇలా లోనికి వెళ్ల‌లేక‌పోయిన వాళ్ల‌లో కొంత‌మంది విమానం టైర్ల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకొని బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌య‌త్నించారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కాసేప‌టికే.. అలా టైర్ల‌ను ప‌ట్టుకొని వేలాడుతున్న ముగ్గురు కింద ప‌డిపోయారు. వాళ్లంతా ఆ ద‌గ్గ‌ర్లోని ఇండ్ల‌పై ప‌డిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

Oh my God.

Desperate Afghans are hanging on the plane tires and falling from the sky near the Kabul airport pic.twitter.com/OhIscfDNWd

— Ragıp Soylu (@ragipsoylu) August 16, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు