బ్లడీ ఇండి...న్స్.. బా...ర్స్... తాగిన మైకంలో ఫ్లైట్‌లో మహిళ రచ్చ

శుక్రవారం, 16 నవంబరు 2018 (13:49 IST)
ఓ విదేశీ మహిళ తాగి విమానంలో రచ్చరచ్చ చేసింది. బ్లడీ ఇండియన్స్... బాస్టర్స్ అంటూ నానా యాగీ చేసింది. ఓ దశలో విమాన సిబ్బందిపై చేయి చేసుకునేందుకు యత్నించింది. ఇదంతా విమాన సిబ్బందితో పాటు విమాన సిబ్బంది చూస్తూ మిన్నకుండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలైంది. ఫలితంగా ఈ వార్త వైరల్ అయింది. 
 
ఈనెల 10వ తేదీన ఎయిర్ ఇండియా ఏఐ-131కు చెందిన విమానం ఒకటి ముంబై నుంచి లండన్‌కు వెళ్లింది. ఈ విమానంలో ప్రయాణించిన ఓ విదేశీ మహిళ మద్యం మత్తులో తాగి ఊగింది. విమాన క్యాబిన్ సిబ్బందిపై పదేపదే దుర్భాషలాడింది. ఆ మహిళ ప్రవర్తనతో విసిగిపోయిన సిబ్బంది ఆ విషయాన్ని పైలట్ కమాండర్‌కు సమాచారం అందించింది. ఆ మహిళ అప్పటికే పీకలవరకు మద్యం సేవించివుందనీ, ఇంకా తనకు మద్యం కావాలంటూ గోల చేస్తుందని చెప్పారు. దాంతో పైలట్ ఆమెకు మద్యం ఇవ్వరాదంటూ ఖరాకండిగా చెప్పాడు. ఈ మాట విన్న ఆ మహిళ తనకు వైన్ ఎందుకు ఇవ్వరంటూ క్యాబిన్‌లో అటూ ఇటూ తిరుగుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ రచ్చరచ్చ చేసింది. 
 
అంతేకాకుండా, తాను ఇంటర్నేషనల్ క్రిమినల్ లాయర్‌ను. నేను మీ అందరి కోసం పని చేస్తుంటాను. దానికి డబ్బులు అవసరం లేదు. కానీ, మీరు నాకు ఓ గ్లాసు వైన్ ఎందుకు ఇవ్వరు.. ఇది కరక్టేనా అంటూ విమాన సిబ్బందిని నానా బూతులు తిట్టింది. చివరకు ఆ మహిళా ప్రయాణికురాలి పట్ల ఎయిర్ ఇండియా కేసు నమోదు చేసింది. అలాగే, ఏఐ సిబ్బంది ఫిర్యాదు మేరకు లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే, సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

Irish business class passenger onboard an Air India Mumbai- London flight verbally abused the crew after she was refused another glass of wine.The crew stopped serving her alcohol because she was drunk. Incident - Nov 10, Flight - AI 131. Atithi Devo Bhava @Hansomniac pic.twitter.com/ESLmynLRUW

— Karthik K (@Karthik_K_94) November 14, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు