50 లక్షలకు చేరువలో అమెరికా కరోనా కేసులు

గురువారం, 6 ఆగస్టు 2020 (08:11 IST)
అమెరికాలో కరోనా కేసులు 50 లక్షలకు చేరువలో ఉన్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను పట్టించుకోకపోవడం వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం అమెరికాలో రోజుకు సగటున 60 వేల కేసులు నమోదవుతున్నాయి. గత నెల జూలైలో రెండో భాగంలో రోజుకు 70వేలకు పైగా కేసులు నమోదయ్యేవి.

వాటితో పోల్చుకుంటే ప్రస్తుత కేసులు సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తున్నా అనేక రాష్ట్రాల్లో కేసులు, మరణాలు అధికంగానే ఉన్నాయి. అలాగే గత రెండు వారాల నుంచి మరణాల సంఖ్య పెరిగిందని అసోసియేట్‌ ప్రెస్‌ నివేదిక తెలిపింది.

గతంలో 780గా ఉన్న సగటు మరణాల సంఖ్య గత రెండు వారాల నుంచి 1,056కు చేరిందని నివేదిక తెలిపింది. అమెరికాలో కరోనాతో 1,55,000 మంది చనిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు