భారత్‌తో యుద్ధానికి ఎంతమంది మద్దతు ఇస్తారంటే ఒక్క పాకిస్థానీ చేయి పైకిలేపలేదు... (Video)

ఠాగూర్

మంగళవారం, 6 మే 2025 (09:38 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార దాడికి దిగితే యుద్ధానికి ఎంతమంది మద్దతు ఇస్తారు అని విద్యార్థులను అడిగితే ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేయి పైకెత్తి సమ్మతం తెలుపలేదు. దీంతో పాక్ మసీదు నిర్వాహకులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఈ అనూహ్య పరిణామం పాకిస్థాన్‌లోని ప్రముఖ లాల్ మసీదులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న వివాదాస్పద లాల్ మసీదులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారత్‌తో యుద్ధం జరిగితే పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తారా అని అక్కడి మత గురువు మౌలానా అబ్దుల్ అజీజ్ ఘాజీ తన అనుచరులను ప్రశ్నించగా, ఒక్కరంటే ఒక్కరు కూడా చేయి పైకిలేపలేదు. ఆ ప్రాంతమంతా పూర్తిగా నిశ్శబ్దం ఆవహించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద భావజాలానికి, ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి కేంద్రంగా భావించే లాల్ మసీదులో చోటుచేసుకున్న ఈ సంఘటన పాకిస్థాన్‌లోని అంతర్గత పరిస్థితులకు అద్దం పడుతోంది. లాల్ మసీదులో విద్యార్థులు, అనుచరును ఉద్దేశించి మౌలానా ఘాజీ ప్రసంగిస్తూ, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను.. సమాధానం చెప్పండి. ఒక వేళ భారత్‌తో పాకిస్థాన్ యుద్ధం చేస్తే మీలో ఎంతమంది పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచి పోరాడుతారు అని ప్రశ్నించారు. అయితే, సమావేశంలో ఉన్న వారిలో ఎవరూ స్పందించలేదు. ఒక్కరూ కూడా చేయి పైకి లేపలేదు. దీనిపై ఘాజీ స్పందిస్తూ, అంటే (పరిస్థితిపై) మీకు తగినంత అవగాహన ఉంది" అంటూ వ్యాఖ్యానించారు. 

 

لال مسجد کے مولانا عبدالعزیز غازی کا خطاب سنئیے جس میں وہ کہتے ہیں کہ پاکستان کی لڑائی قومیت کی لڑائی ہے اسلام کی نہیں اور پاکستان میں بھارت سے زیادہ ظلم ہے وغیرہ وغیرہ۔ ریاست کے وہ کارندے غور سے سُنیں جو ان حضرات کی سرپرستی کرتے ہیں اور سیکولر پاکستانیوں کو خطرہ سمجھتے ہیں۔ pic.twitter.com/l9Or4OJWHl

— Husain Haqqani (@husainhaqqani) May 4, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు