ఇటీవలి కాలంలో పాకిస్థాన్ దేశంలో హిందువులపై దాడులు, దురాగతాలు పెరిగిపోతున్నాయి. లాహోర్‌లో ఓ సిక్కు యువతిని అపహరించిన కొందరు యువకులు ఆమెను ఇస్లాంలోకి మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ వివాదం ఇంకా సమసిపోకముందే మరో ఘటన వెలుగుచూసింది.
బాబర్, బాధిత బాలిక ఆచూకీ లభించలేదు. యువతులను ఎత్తుకెళ్లి మతం మార్చి ముస్లిం యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం లాంటి ఘటనలు పాక్‌లో ఇటీవల బాగా పెరిగాయి. తాజా ఘటన వారంలో రెండోది కాగా, రెండు నెలల్లో ఇది మూడోదని పాకిస్థాన్‌కు చెందిన హిందూ ఎన్జీవో "ఆల్ పాకిస్థాన్ హిందూ పంచాయత్" సంస్థ తెలిపింది.