కరెంట్ బిల్లు చెల్లించలేని దుస్థితితో పాక్ ప్రధాని కార్యాలయం... నోటీసులు

గురువారం, 29 ఆగస్టు 2019 (17:10 IST)
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుంది. దీనికి నిదర్శనమే ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం చివరకు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది. దీంతో ఆ దేశ విద్యుత్ బోర్డు పీఎంవోకు నోటీసులు జారీచేసింది. తక్షణం బిల్లు చెల్లించలేని పక్షంలో కరెంట్ కట్ చేస్తామని ఆ నోటీసులో పేర్కొంది. 
 
ఇప్పటివరకు పాక్ కరెన్సీలో రూ. 41 లక్షల బకాయిలు పేరుకుపోయాయట. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ... తాజాగా బుధవారం మరోసారి నోటీసు జారీ చేసింది. బకాయిలు వెంటనే చెల్లించాలని... లేనిపక్షంలో కరెంట్ సరఫరా నిలిపి వేస్తామని నోటీసులో హెచ్చరించింది.
 
ఆ దేశంలో వాస్తవపరిస్థితి అలా ఉంటే... పాకిస్థాన్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కాశ్మీర్ అంశంపై భారత్‌తో యుద్ధం చేయడానికి సిద్ధమని ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు