చైనాకు చెందిన ఏఏ స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ తాజాగా ప్రకంపనలు సృష్టిస్తుంది. మనం కోరిన సమాచారాన్ని చిటికెలో, అది కూడా ఖచ్చితత్వంతో అందిస్తోంది. తన సామర్థ్యంతో చాట్ జీపీటీ, జెమినీలకు పోటీగా మారింది.
ఈ టీమ్‌లో 29 ఏళ్ల లువో పులి ఎంతో కీలకం అని చెప్పాలి. ఆమె ఓ టెక్ రీసెర్చర్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో ఆమె దిట్ట. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను తీసుకున్నా, అందులో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎంతో కీలకం. లువో పులి... 2022లో డీప్ సీక్ టీమ్‌లో చేరాక, ఆ ఏఐ ప్రాజెక్టు శరవేగంగా పరుగులు పెట్టింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఏఐ టెక్‌ను అభివృద్ధి చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ భావిస్తారు. కానీ, డీప్ సీక్ స్టార్టప్ మాత్రం చాలా తక్కువ వనరులతోనూ అద్భుతమైన ఏఐ టూల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం డీప్ సీక్ ఏఐ టూల్ రెండు (R1, R2) మోడళ్లలో అందుబాటులో ఉంది. ఇందులో R1 మోడల్ ఉచితం అని తెలుస్తోంది.