బాల్కనీ అంచున ఊగుతూ కిందపడిన చిన్నారి.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం...

ఠాగూర్

గురువారం, 30 జనవరి 2025 (10:05 IST)
మహారాష్ట్రలోని థానేలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తాలూకూ వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటన ఎపుడు జరిగిందో తెలియనప్పటికీ వీడియోను చూస్తుంటే మాత్రం ఒళ్ల జలదరిస్తుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం.. ఆ చిన్నారికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలేవున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
రెండేళ్ల చిన్నారి 13వ అంతస్తు నుంచి పడడం వీడియోలో ఉంది. అయితే, ఓ వ్యక్తి సమయస్ఫూర్తితో ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. దాంతో అంత ఎత్తు నుంచి కిందపడినా.. పాప స్వల్ప గాయాలతోనే బయటపడింది. థానే పరిధిలోని డోంబివలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
స్థానికంగా ఉండే ఓ అపార్టుమెంట్‌ 13వ అంతస్తులోని బాల్కనీ వద్ద చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కిందపడుతుండటాన్ని భవేశ్ మాత్రే అనే వ్యక్తి గమనించాడు. దాంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కిందపడుతున్న పాపను పట్టుకునేందుకు పరిగెత్తాడు. 
 
చిన్నారిని పూర్తిగా పట్టుకోలేకపోయినప్పటికీ.. ఆమె నేరుగా నేలను తాకకుండా కొంతమేర ఆపగలిగాడు. దాంతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగాడు. దీంతో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. 
 
13వ అంతస్తులోని బాల్కనీలో ఆడుకుంటూ చిన్నారి పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. "బాల్కనీ అంచున కొంతసేపు ఆమె ప్రమాదకరంగా వేలాడుతూ, ఆపై పడిపోయింది" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
 
భవేశ్ మాత్రే మాట్లాడుతూ... "ఎలాగైనా చిన్నారి ప్రాణాలను కాపాడాలని నిశ్చయించుకున్నాను. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్లాను. ధైర్యం, మానవత్వాన్ని మించిన మతం ఏదీ లేదు" అని విలేకరులతో అన్నాడు. 
 
చాకచక్యంగా వ్యవహరించిన మాత్రేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే, పాపను కాపాడిన మాత్రేను ప్రభుత్వ అధికారి ఒకరు ప్రశంసిస్తూ, త్వరలోనే ఆయనను సన్మానిస్తామని పేర్కొన్నారు. 


 

इमारतीच्या तिसऱ्या मजल्यावरून चिमुकला पडला अन् चमत्कार घडला, CCTV फुटेज तुफान व्हायरल#DombivliNews #Dombivlivideo #Dombivli pic.twitter.com/Ytchw1MiUi

— Hindustan Times Marathi (@htmarathi) January 26, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు