అలాగే 72 వరకు గాయపడినట్లు రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు రైలులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ రైలులో 350 వరకు ఉన్నారు. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీమ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.