మూడు నెలల్లో 101 దోపిడీలు.. ఘరానా దొంగ అరెస్ట్.. ఆరు సంవత్సరాల జైలుశిక్ష

శుక్రవారం, 7 అక్టోబరు 2016 (10:00 IST)
ఆస్ట్రేలియా దేశంలో కేవలం మూడు నెలల్లోనే 101 దోపిడీలు చేసిన ఘరానా దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వంద తప్పుల వరకు మన్నించి.. ఆపై శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. అలా వంద దోపిడీలకు తర్వాత ఘరానా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా దేశంలోని వెల్లింగ్బొరో నగరానికి చెందిన బిట్టర్ బ్రైన్ ప్లుంబ్ అనే 41 ఏళ్ల వ్యక్తి కేవలం మూడు నెలల్లో 101 దోపిడీలు చేసి పోలీసులకే సవాలు విసిరాడు. 2012 వసంవత్సరంలో బిట్టర్‌కు నార్తాంప్టన్ నగరంలో దోపిడీలు చేసిన ఘటనలో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
 
బకింగ్ హామ్ బహిరంగ జైలు వద్ద కస్టడీ నుంచి తప్పించుకున్నబిట్టర్ మళ్లీ దోపిడీలకు తెర తీశాడు. దీంతో మళ్లీ కోర్టు తాజాగా బిట్టర్‌ను ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇతను జూన్, జూలై, ఆగస్టు నెలల్లోనే దోపిడీలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 30వతేదీన ఓ ఇంటి కిటికీ నుంచి దూకి పారిపోతుండగా పోలీసులు అతడిని పోలీసులు పట్టుకున్నారు.

వెబ్దునియా పై చదవండి