అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా అధ్యక్షుడు జో-బైడన్‌ను సంపాదన విషయంలో వెనక్కి నెట్టారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతని భార్య జిల్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త డగ్లస్ తమ 2020 ఆదాయ, వ్యయాలను ప్రకటించారు. వీరందించిన గణాంకాల ప్రకారం, బైడెన్ ఆదాయంలో రెండున్నర రెట్లు ఎక్కువగా కమలా హారిస్ సంపాదిస్తున్నారు. బైడెన్ కంటే కమలా ఎక్కువ పన్ను చెల్లిస్తున్నారు.
వైట్ హౌస్ ప్రకారం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతడి భార్య జిల్ 2020లో ఆరు లక్షల ఏడు వేల డాలర్లు (దాదాపు రూ.4.30 కోట్లు) సంపాదించారు. 2019 లో ఈ జంట ఆదాయం 9 లక్షల 85 వేల డాలర్లు (దాదాపు రూ. 7.18 కోట్లు). 2019 తో పోల్చితే వారి ఆదాయం గత సంవత్సరం తగ్గింది. అతను తన ఆదాయంపై 25.9 శాతం పన్ను చెల్లిస్తున్నారు.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త డగ్లస్ అమ్హాఫ్ 2020 లో దాదాపు 1.7 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.38 కోట్లు) ఆదాయాన్ని పొందారు. ఈ జంట ఆరు లక్షల 21 వేల డాలర్ల పన్నును ప్రభుత్వానికి చెల్లించారు. వీరి పన్ను రేటు 36.7 శాతం.
కమలా హారిస్ అమెరికా అధ్యక్షుడు, అతని భార్య సంపాదించిన దానికంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు. కమలా హారిస్ కాలిఫోర్నియాలో 1.25 మిలియన్ డాలర్ల పన్నును, ఆమె భర్త కొలంబియాలో 56 వేల డాలర్ల పన్నును చెల్లించారు. 2020 లో ఆయన 27 వేల డాలర్లు విరాళంగా ఇచ్చారు.