బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత, ఎంపీ అయిన డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన మీట్ యువర్ లోకల్ ఎంపీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై అకస్మాత్తుగా దాడిచేసిన ఓ వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు.
జంతు సమస్యలతోపాటు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. అమీస్ మృతికి ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను భయంకరమైనదిగా, తీవ్ర దిగ్భ్రాంతికరమైనదిగా ప్రతిపక్ష లేబర్ పార్టీ అభివర్ణించింది.