వీడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. స్నేహితుల మాంసాన్ని నూనెలో వేయించుకుని?

శనివారం, 13 ఫిబ్రవరి 2021 (16:20 IST)
Eduard Seleznev
వీడు మనిషి కాదు.. కిరాతకుడు.. నేరాలు వింటే ఒళ్లు గగుర్పాటుకు గురికాక తప్పదు. అతి కిరాతకంగా నేరాలు చేసిన వారి గురించి చెప్పుకునే సందర్భంలో నరరూప రాక్షసుడనే అంటారు. రష్యాకు చెందిన ఈ దుర్మార్గుడు తన ముగ్గురు స్నేహితులను హత్య చేసి వారి మాంసాన్ని కాల్చుకుని తిన్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఎడ్వర్డ్ సెలెజ్‌నెవ్(51) తన ముగ్గురు స్నేహితులను అత్యంత కిరాతకంగా చంపాడు. నరమాంస భక్షకుడిగా మారి వారి శవాలను కాల్చుకుని తిన్నాడు. 2016, 2017 మధ్య ఈ హత్యలను పాల్పడ్డాడు. తాజాగా.. రష్యా కోర్టు ఎడ్వర్డ్‌కు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది.
 
ఎడ్వర్డ్ నేరం అంగీకరించడంతో మూడేళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన ఈ కేసులో చిక్కుముడి వీడింది. ఎడ్వర్డ్‌ వీధుల్లో కనిపించే పిల్లులు, కుక్కలు, పక్షులు, చిన్నచిన్న జంతువులను కూడా వదిలేవాడు కాదని విచారణలో తేలింది. వాటిని చంపి.. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఉడకబెట్టుకుని, నూనెలో వేయించుకుని తినేవాడినని ఎడ్వర్డ్ విచారణలో తెలిపాడు. ఎడ్వర్ట్‌కు కోర్టు శిక్షలు, నేరాలు కూడా కొత్త కాదట. గతంలో ఓ జంట హత్యల కేసులో ఎడ్వర్డ్ 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చినట్లు తెలిసింది.
 
ముగ్గురు స్నేహితులను చంపి.. వారి మాంసాన్ని భుజించిన కేసులో పెరోల్‌కు కూడా అవకాశం ఇవ్వకుండా కఠినంగా శిక్ష అమలు చేయాలని రష్యా సుప్రీం కోర్టు తాజాగా ఆదేశించింది. ఎడ్వర్డ్ తరపు లాయర్లు అపీల్‌కు వెళ్లకపోవడంతో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు