బ్రేకప్ ఇచ్చిన కారణంగా బాయ్‌ఫ్రెండ్‌కు చుక్కలు చూపించింది చైనా యువతి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఓ యువతికి తన ప్రియుడు కొద్ది రోజుల క్రితం బ్రేకప్ చెప్పాడు. ఈ క్రమంలో ఆమె అతనిపై రివేంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా సదరు యువతి.. కాఫీ ఆర్డర్ చేసింది.
అయితే ఆ కాఫీ తన గురించి కాదనీ.. తన మాజీ ప్రియుడి కోసమనీ అందులో ఆ యువతి పేర్కొంది. అంతేకాకుండా ఆ కాఫీని మర్యాదగా అతని చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదని.. ముఖం మీద చల్లితే సరిపోతుందని సూచించింది. ఈ క్రమంలో ఓ డెలివరీ బాయ్.. ఆ యువతి మాజీ ప్రియుడి ముందు కాఫీ కప్పుతో ప్రత్యక్షమై.. కప్పులో ఉన్న కాఫీని అతనిపై చల్లేశాడు.