వాస్తవాధీన రేఖ వెంబడి భారత వాయుసేన కార్యకలాపాలపై చైనా అభ్యంతరం

మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:40 IST)
పొరుగుదేశం చైనా మళ్లీ తోకజాడిస్తుంది, భారత్, చైనా దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి యధేచ్చగా ఆక్రమలకు పాల్పడున్న డ్రాగన్ కంట్రీ.. ఇపుడు ఇదే వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ వాయుసేన నిర్వహిస్తున్న కార్యకలాపాలపై తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 
 
వాస్తవాధీన రేఖ వద్ద దళాలు, నిర్మాణ సామగ్రిని తరలించడానికి భారత్‌ హెలికాప్టర్లను వినియోగిస్తోంది. గత కొద్ది వారాలుగా భారత్‌ వైపు భూభాగంలో డ్రోన్‌ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తోంది. వీటిపై స్థానిక కమాండర్లతో చైనా అధికారులు మాట్లాడినట్లు సమాచారం.
 
ఇటీవల జూన్‌లో చైనాకు చెందిన ఓ యుద్ధ విమానాం వాస్తవాధీన రేఖ సమీపంలో ఎగిరింది. ఈ నేపథ్యంలో దీనిపై 16వ విడత చర్చల్లో మాట్లాడుకొన్నారు. ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించే సమయంలో ఇరు పక్షాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. 
 
అయితే, గతంలో చైనా చొరబాట్లను పరిశీలిస్తే అత్యధికంగా ఈ సీజన్‌లో చేసినవే ఉంటాయి. గతేడాది చూస్తే సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్య భారత దళాలు ఒక సారి చైనా చొరబాట్లను అడ్డుకొన్నాయి. ఈ ఘటన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో చోటుచేసుకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు