మయన్మార్‌లో తిరుగుబాటు.. 38మంది మృతి.. రోడ్డుపైనే మృతదేహాలు..

సోమవారం, 15 మార్చి 2021 (16:01 IST)
Myanmar
మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు దారులపై దారుణానికి ఒడిగట్టింది. తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు దేశమంతటా పెరుగుతున్నాయి. ఆదివారం వివిధ ప్రదేశాలలో నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తులపై సైన్యం కాల్పులు జరిపింది. వీరిలో దాదాపు 38 మంది మరణించినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

యాంగోన్ ప్రాంతానికి చెందిన హంగ్తాయలో నిరసనకారులు చక్కెర కర్మాగారానికి నిప్పంటించారని వార్తలు వచ్చాయి. దాంతో అక్కడ సైన్యం కఠిన చర్యలు తీసుకుని వారిని అదుపులో పెట్టేందుకు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 22 మంది మరణించారు. 
 
ఇతర ప్రదేశాలలో ప్రదర్శన జరుపుతున్న ఆందోళనాకారులపై సైన్యం జరిపిన కాల్పల్లో మరో 16 మంది మరణించారు. ఒక పోలీసు కూడా చనిపోయినట్లు సమాచారం. కాగా, మయన్మార్‌లో ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 125 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని మయన్మార్‌లోని ఒక వార్తా సంస్థ తెలిపింది. చాలా ప్రాంతాల్లో మృతదేహాలు ఇంకా రోడ్డుపైనే పడి ఉన్నాయి. శనివారం నాటికి వరకు 2,150 మందికి పైగా ప్రదర్శనకారులను అదుపులోకి తీసుకున్నారు.
 
సైన్యం ఆధ్వర్యంలో నడుస్తన్న టీవీ ఛానల్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. నిరసనకారులు నాలుగు వస్త్ర, ఎరువుల కర్మాగారాలకు నిప్పంటించారు. అక్కడ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అగ్నిమాపక దళాన్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. దాంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేసందుకు సైన్యం కాల్పులు జరపవలసి వచ్చింది. కాల్పుల ఘటనలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక రాయబారి క్రిస్టిన్ ష్రైనర్ బెర్గ్నర్ ఖండించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు