పెంపుడు చేప లూంపాకు అంత్యక్రియలు.. వీడియో వైరల్

బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (13:22 IST)
fish loompa
సాధాణంగా ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి వాటిని పెంచుకుంటారు. అంటే వీటిని పెంపుడు జంతువులుగా పేర్కొంటారు. అత్యంత ప్రేమగా పెంచుకునే ఈ జంతువులు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తంచేస్తుంటారు. ఆ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు మాత్రం చేపను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలాంటి చేప చనిపోతే ఆ విద్యార్థులు జీర్ణించుకోలేక పోయారు. ఆ చేపకు అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఇంతకీ ఆ విశ్వవిద్యాలయం పేరు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్. ఆస్టిన‌లో ఉంది. ఇందులో చదువుకునే విద్యార్థులు గత కొంతకాలంగా సిల్వర్‌ కార్ప్‌ జాతికి చెందిన ఓ చేపను అపురూపంగా పెంచుతున్నారు. దానికి లూంపా అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ మధ్యే ఆ చేప చనిపోయింది. దీంతో ఆ చేపకు ఆ వర్సిటీ విద్యార్థులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..! 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు