కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే కరోనా మృతులు 20 లక్షలకు చేరే అవకాశం అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
అసలు పది లక్షలమంది చనిపోవడమనేదే ఊహించలేని సంఖ్య అని, అది మరో పది లక్షలకు చేరకముందే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ అన్నారు.