ఒక్క రోజే 540మంది మృతి-3017కు పెరిగిన కరోనా మృతుల సంఖ్య

మంగళవారం, 31 మార్చి 2020 (10:46 IST)
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. సోమవారం ఒక్క రోజే ఏకంగా 540మంది మృతి చెందారు. ఫలితంగా మృతుల సంఖ్య 3017కు పెరిగింది. 1.63 లక్షల మంది వైరస్ బారినపడి పోరాడుతున్నారు.
 
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ఆసుపత్రుల్లో చోటు దక్కకపోవడంతో ఓ భారీ నౌకను ఆస్పత్రిగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇంకా కాలిఫోర్నియాలో గత నాలుగు రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఐసీయూలో చేరుతున్న బాధితుల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్టు గవర్నర్ గావిన్ న్యూసమ్ చెప్పారు. కాగా, భారత్‌లో ఉన్న అమెరికన్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు