ఇజ్రాయేల్‌లో కరోనా విజృంభణ.. సెప్టెంబర్ 18 నుంచి లాక్ డౌన్

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (18:51 IST)
ఇజ్రాయేల్‌లో కరోనా జనాలకు చుక్కలు చూపిస్తోంది. ఇజ్రాయేల్‌లో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరగడంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నారు. సెప్టెంబర్ 18న ఉదయం 6 గంటలకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రారంభమై రెండు వారాల పాటు కొనసాగనుంది. దేశంలోని అన్ని పాఠశాలలు, కిండర్ గార్టెన్‌లు రెండు రోజుల ముందుగానే సెప్టెంబర్ 16న మూసివేయబడతాయి. 
 
ఇజ్రాయెల్ క్యాబినెట్ గురువారం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. లాక్‌డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు మినహా.. రెస్టారెంట్లు, హోటళ్లు, సంస్కృతి, వినోద ప్రదేశాలు, కార్యాలయాలు, దుకాణాలన్నీ మూసివేయబడతాయి. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 153,000 కరోనా కేసులు నమోదు కాగా 1,103 మంది వ్యాధి బారిన పడి మరణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు