ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ పెద్దదిక్కుగా మారింది. ముఖ్యంగా, కరోనా వైరస్‌కు తాత్కాలిక ఉపశమనంగా హైడ్రోక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని వాడుతున్నారు. ఈ మాత్రలను సరఫరా చేయాలని అనేక ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తూ, అన్ని దేశాలూ భారత్ వైపు చూస్తున్నాయి.
మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ ఆరంభం నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా, వైద్య సదుపాయాలు పెద్దగా లేకున్నా కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించింది. దీంతో ఇండియాలో కొంత వరకు కట్టడి అయ్యిందని చెప్పాలి. ఇక భారత్‌లో ఫార్మా ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందింది. భారత్ నుంచి ప్రపంచంలోనే అనేక దేశాలకు మెడిసిన్స్ ఎగుమతి అవుతుంటాయి.
భారతలో సరిపడా మెడిసిన్ ఉన్న తర్వాతే బయటకు సప్లై చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇండియా ఈ ఔషధాన్ని ఎగుమతి చేయడం మొదలుపెడితే ప్రపంచంలోని 30 దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అయితే, ఆరోగ్యశాఖ నుంచి వచ్చే గ్రీన్ సింగ్నల్ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నది.