న్యూజిలాండ్‌ గవర్నర్‌ జనరల్‌ ఆదివాసీ మహిళ సిండీ కైరో

సోమవారం, 24 మే 2021 (22:35 IST)
Cindy Kiro
న్యూజిలాండ్‌ తదుపరి గవర్నర్‌ జనరల్‌గా తొలిసారిగా ఆదివాసీ మహిళ, బాలల హక్కుల కార్యకర్త సిండీ కైరో పేరును ఆ దేశ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్‌ ప్రకటించారు. తన ప్రతినిధిగా ఈ నియమాకానికి రాణి ఎలిజబెత్‌ 2 కూడా ఆమోద ముద్ర వేశారని తెలిపారు. న్యూజీలాండ్‌ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం, బ్రిటీష్‌ రాణినే దేశాధినేతగా వుంటారు. అయితే రోజువారీ అధికారాల్లో ఆమెకు ఏవిధమైన జోక్యమూ వుండదు. 
 
అక్టోబరు నుండి సిండీ కైరో ఐదేళ్ల పదవీకాలం ప్రారంభమవుతుంది. పాస్తీ రెడ్డి స్థానంలో తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత మావోరి బాలికలను స్ఫూర్తిపరిచేలా చర్యలు తీసుకుంటానని ఆమె ప్రకటించారు. తన మావోరి, బ్రిటీష్‌ మిశ్రమ వారసత్వం దేశ చరిత్రను మరింత బాగా అవగాహన చేసుకోవడానికి సహాయపడిందని కైరో పేర్కొన్నారు.
 
ప్రస్తుతం కైరో స్వచ్ఛంద సంస్థ రాయల్‌ సొసైటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వున్నారు. గతంలో బాలల కమిషనర్‌గా కూడా ఆమె పనిచేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. బాలలు, యువత సంక్షేమం పట్ల ఆమె కృషి ఎనలేనిదని ప్రధాని జసిండా కొనియాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు