మృతుల వివరాలతో పాటు ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. జెట్ బ్లూకు చెందిన విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా, రెండు మృతదేహాలను గుర్తించారు. ఈ విషయాన్ని జెట్ బ్లూ సంస్థ ధ్రువీకరించింది.
ఇదిలావుంటే, అమెరికాలో గడచిన నెల రోజుల్లో ఈ తరహా ఘటన జరగడం ఇదే రెండోసారి కావడం గమనార్హం. డిసెంబరులో షికాగో నుంచి మౌయా విమానాశ్రయానికి వచ్చిన ఓ యూనైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్ కూడా ఓ మృతదేహం లభ్యమైన విషయం తెల్సిందే.