అబ్బా.. తిమింగలం కడుపున కిలోలు కిలోలుగా ప్లాస్టిక్..

బుధవారం, 21 నవంబరు 2018 (15:16 IST)
తుఫాను, సునామీల దెబ్బకు సముద్రంలో జీవించే జీవరాశులు తీరానికి చేరుకోవడం చూసేవుంటాం. ఇలా ఇండోనేషియాలో ఓ తిమింగలం సముద్ర తీరానికి చేరుకుంది. ఇండోనేషియాలోని జకార్త ప్రాంతంలో చనిపోయిన ఓ తిమింగలం తీరానికి చేరింది. ఆ తిమింగలాన్ని చూసిన జాలర్లు ఆ తిమింగలం కడుపు నుంచి ప్లాస్టిక్‌ను బయటికి తీశారు. కిలోల లెక్కన తిమింగలం ప్లాస్టిక్ తినడంతోనే చనిపోయిందని వారు చెప్తున్నారు. 
 
అంతేగాకుండా తిమింగలం కడుపులో మేకులన్నట్లు జాలర్లు గుర్తించారు. దీంతో ఇండోనేషియాలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని డిమాండ్ పెరిగింది. ఇండోనేషియా సముద్ర తీర ప్రాంతాల్లో వ్యర్థాలుగా ప్లాస్టిక్ అధికంగా వున్నట్లు జాలర్లు తెలిపారు.
 
అంతేగాకుండా అత్యధికంగా ప్లాస్టిక్‌ను ఇండోనేషియాలో సముద్రంలో కలుపుతున్నట్లు తెలియవచ్చింది. చైనాకు తర్వాత అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఇండోనేషియాలో సముద్రపు నీటిలో కలుపుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇలా ప్రజలు ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థాలు సముద్రపు జీవరాశులకు పెద్ద దెబ్బ తెస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు