విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

ఠాగూర్

మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (08:49 IST)
కెనడాలోని టొరంటో పియర్స్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ విమానం ల్యాండ్ అవుతూ తిరబడింది. ఈ ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 80 మంది  ప్రయాణికులు ఉన్నారు. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బలమైన గాలులే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. 
 
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విమానంలో మిన్నియాపొలిస్ నుంచి వస్తున్నవారు కూడా ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విమానం మిన్నియాపొలిస్ నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి చాలామంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్టు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

తిరగబడిన విమానం

కెనడాలోని టొరంటోలో తిరగబడిన డెల్టా సంస్థకు చెందిన విమానం

అమెరికా నుంచి వస్తున్న ఆ విమానం సరిగ్గానే ల్యాండ్ అయినా, రన్ వే అంతా మంచుతో నిండిపోవడంతో బోల్తా

ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ జరగలేదని, 15 మంది గాయపడినట్లుగా సమాచారం

ఘటన సమయంలో విమానంలో 80 మంది… pic.twitter.com/1UASh9OoCz

— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు