ఈస్ట్‌యార్క్‌షైర్‌లో ఓ విచిత్ర అనుభవం ఒకటి ఎదురైంది. టీవీలో ప్రసారమవుతున్న 'మోస్ట్ హాన్‌టెడ్ (వెంటాడే ఆత్మలు)' అనే కార్యక్రమ చిత్రీకరణకు వెళ్లిన బృంద సభ్యులకు ఊహించని పరిణామం ఎదురైంది. బృందంలోని మహిళపై దెయ్యం అత్యాచారయత్నం చేసిందట. ఈ ఘటన ఈస్ట్‌యార్క్‌షైర్‌లోని స్మశానంలో ఉన్న హల్‌షమ్ భవనంలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే... స్థానకంగా ప్రసారమవుతున్న మోస్ట్ హాన్‌టెడ్ కార్యక్రమానికి ఓ టీవీ చానెల్‌కు చెందిన బృందం ఒకటి.. 16 శతాబ్దానికి చెందిన గ్రేడ్ 2 భవనాలలో షూటింగ్ చేపట్టింది. ఎలిజిబెత్ అనే దెయ్యాన్ని కనుగొనడమే టార్గెట్‌గా ఈ కార్యక్రమం సాగుతోంది. చిత్రీకరణకు వెళ్లిన మహిళపై గత శనివారం రాత్రి 11 గంటల సమయంలో అత్యాచారయత్నం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
దీనిపై స్థానిక చరిత్ర కారుడు మైక్ కోవెల్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుతాయని, దెయ్యమనేది అబద్దమైతే మీ చూట్టూ కెమెరాలు ఉన్నాయి కదా? ఏవరు ఈ ప్రయత్నం చేశారో మీ కెమెరాలలో ఎందుకు రికార్డ్ కాలేదని ప్రశ్నించాడు. అందుకే ఈ ఘటనను అనుమానించాలన్నాడు. అలాగే, విచారణకు వెళ్లే పోలీసులు కూడా బృందాలుగా వెళ్లాలని ఆయన సలహా ఇచ్చాడు.