మెక్సికో సరిహద్దుల్లో గోడను నిర్మించేందుకు అమెరికా అధ్యక్షుడు మొండిపట్టుపట్టారు. కానీ, ఈ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు హౌస్ ససేమిరా అంటోంది. దీంతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైట్‌హౌస్‌లో కిచన్ మూసివేత, ఆపై ట్రంప్ పిజ్జాలు, బర్గర్లను బయటి నుంచి ఆర్డర్ చేసి రప్పించారన్న వార్తపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఇందుకోసం వైట్‌హౌస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో 'మీరు ఈ సమయంలో వాషింగ్టన్‌లోనే ఉండి, నాతో, సహచర సభ్యులతో చర్చించాలని నేను కోరుకుంటున్నాను. ఈ షట్‌డౌన్‌ను ఇంతటితో ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ప్రయాణానికి అవసరమైన నిధులను కల్పించే పరిస్థితి లేదు. షట్‌డౌన్ ముగిసిన తర్వాత మీ ప్రయాణాన్ని పెట్టుకోవచ్చు' అని అన్నారు.