భారత్ అన్ని రంగాల్లో దూసుకెళుతోందని కానీ, మనమెందుకు సాధిండం లేదనీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శల వర్షం కురిపించారు.
సాధారణంగా పెద్ద దేశాలకు వృద్ధిని నమోదు చేయడం చాలా కష్టమని... కానీ, భారత్ దాన్ని సాధిస్తోందని అన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే... నాలుగు శాతం వృద్ధిని సాధిస్తానని తెలిపారు. 7 శాతం వృద్ధిని సాధించినా చైనా తృప్తిగా లేదని... అమెరికా మాత్రం మెక్సికో, ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలను తరలిస్తూ అలాగే ఉండిపోయిందని మండిపడ్డారు.