ఇప్పటికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. అంతేగాకుండా, ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే, తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా హెచ్చరించింది.
కాగా.. ఇప్పటికే తన వారసుడి ఎంపిక విషయంలో దలైలామా చైనాకు షాకిచ్చారు. తదుపరి దలైలామా ఎంపిక నిర్ణయం తనదేనని చెప్పారు. తదుపరి దలైలామాగా ఎవరు ఉండాలో నిర్ణయించే హక్కు ఇతరులకు లేదన్నారు. చైనా ఎంపికచేసే వారసుడికి గౌరవం దక్కదని ఆయన స్పష్టం చేశారు. తన వారసుడు భారత్‌లోని తన అనుచురల్లో ఒకరు కావచ్చని కూడా ఆయన తెలిపారు. తన వారసుడిని ఎంపిక చేసేది లేనిదీ తనకు 90 ఏళ్ల వయసు వచ్చాక నిర్ణయిస్తానని దలైలామా 2011లోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏళ్లు.