దక్షిణ చైనా సముద్రంలో చైనా బలగాలు పట్టుకున్న అమెరికా నేవీకి చెందిన మానవరహిత గ్లైడర్ తమకు అవసరం లేదని అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తద్వారా చైనాకు ట్రంప్ షాక్ ఇచ్చారు. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న అమెరికా నేవీ ఓషనోగ్రాఫీ (సముద్ర అధ్యయన) డ్రోన్‌ను చైనా యుద్ధనౌక స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నానని, ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చైనా చెప్తుండగా.. ఆ దేశం తీరుపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైనా దొంగలించిన డ్రోన్ తమకు అవసరం లేదని.. దానిని వారే ఉంచుకోవచ్చునని ట్విట్టర్లో ట్రంప్ పేర్కొన్నారు.