దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ దేశంలో సంభవించిన భారీ వరదల వల్ల ఇప్పటివరకు సుమారుగా 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అలాగే, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఈ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 398కు చేరగా, 27 మంది గల్లంతైనట్టు సౌతాఫ్రికా వర్గాల సమాచారం. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. డర్బన్ జిల్లాలో తప్పిపోయిన ఒక కుటుంబానికి చెందిన 10 మంది ఆచూకీ తెలియంలేదు.