బస్సుల్లో అయితే మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే, సిటీ రైళ్లలో మహిళలకంటూ ప్రత్యేక బోగీలు ఉంటాయి. కానీ, సాధారణ బోగీల్లో మాత్రం వృద్ధులకైనా, మహిళలకైనా ప్రత్యేకించి సీట్లు ఉండవు.
చైనాలోని నాన్‌జింగ్ పట్టణంలో సబ్‌వే మెట్రోరైలులో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది. కాకపోతే ఇక్కడ దివ్యాంగుల సీటు కోసం మహిళ, యువకుడు వాదించుకున్నారు. ఎంతసేపు వాదించినా యువకుడు సీటు ఖాళీ చేయకపోవడంతో మహిళ అతని మీద కూర్చుంది.