సముద్రంలో ఇథియోపియా ఎయిర్‌లైన్ : 157 మంది ప్రయాణికుల గల్లంతు

ఆదివారం, 10 మార్చి 2019 (15:39 IST)
ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇథియోపియా ప్రధాని కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ విమాన ప్రమాదంలో 157 మంది ప్రయాణికులంతా చనిపోయివుంటారని భావిస్తున్నారు. విమాన ప్రమాదంలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ కార్యాల‌యం ట్విటర్ వేదికగా వెల్ల‌డించింది. ప్రమాద సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం.. అడిస్ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 8:38 గంటలకు విమానం గాల్లోకి లేచిందని.. ఆ తర్వాత కొంతసేపటికే 8:44 గంటలకే ప్రమాదానికి గురైందన్నారు. ప్రమాదానికి గల కారణాలు, విమానం ఎక్కడ కుప్పకూలిందన్న వివరాలు ఇంకా తెలియలేదు. ప్రాణ‌న‌ష్టం భారీగా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు