ఓ మహిళా ఉద్యోగినికి ఆదివారం సెలవు ఇవ్వకుండా పని చేయించుకున్నందుకు కంపెనీకి రూ.152 కోట్ల అపరాధం విధిస్తూ ఓ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ కోర్టు వెలువరించింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
హైతీ దేశానికి చెందిన మేరీ అనే ఓ మహిళ ఫ్లోరిడాలోని మియామీకి వలస వచ్చింది. అక్కడే ఉన్న ఓ నక్షత్ర హోటల్లో పనిలో చేరింది. ఆమె విధుల్లో చేరిన కొత్తల్లో ఆదివారం సెలవు ఇచ్చింది. హోటల్లో ఆరు రోజులు, చర్చిలో ఆదివారం పని చేస్తూ పోషణ సాగిస్తూ వచ్చింది.