ట్రంప్ మద్దతుదారులతో అమెరికాలో హింస.. నలుగురు మృతి

గురువారం, 7 జనవరి 2021 (12:48 IST)
అమెరికా క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌లో జరిగిన హింసలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో అధికారులు 52 మందిని అరెస్టు చేశారు. బైడెన్ విజయాన్ని ఖారారు చేసేందుకు జరుగుతున్న సమావేశాలను అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అభిమానులంతా క్యాపిటల్ హిల్‌ను అటాక్ చేశారు. ఆ సమయంలో జరిగిన హింసలో క్యాపిటల్ గ్రౌండ్‌లోనే సుమారు 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
లైసెన్సు లేని .. నిషేధిత ఆయుధాలు కలిగి ఉన్న వారిని కూడా అరెస్టు చేశారు. రిపబ్లికన్‌, డెమోక్రటిక్ నేషనల్ కమిటీ హెడ్‌క్వార్టర్ల వద్ద రెండు పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. క్యాపిటల్ పోలీసు ఆఫీసర్ జరిపిన ఫైరింగ్‌లో ఓ మహిళ మృతిచెందింది. 
 
మరో ముగ్గురు మెడికల్ ఎమర్జెన్సీ కారణాల వల్ల మృతిచెందారు. క్యాపిటల్ అటాక్ ఘటనలో మొత్తం 14 మంది పోలీసులు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. క్యాపిటల్ హిల్ ఘటనలో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.  
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు